Third Degree | హైదరాబాద్, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): పోలీసులు ఇండ్లలోకి చొ చ్చుకొచ్చి తమ వాళ్లను దొరికినవాళ్లను దొరికినట్టు లాక్కెళ్లి చిత్రహింసలు పెట్టారని లగచర్ల బాధిత రైతులు భోరున విలపిస్తున్నారు. లాఠీలతో చితకబాదారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అర్ధరా త్రి స్టేషన్లకు తరలించి గిరిజన రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితులు, వారి కుటుంబీకులు బోరుమంటున్నా రు. తమను ఆదుకుని న్యాయం చేయాలంటూ గురువారం హైదరాబాద్‌లోని ‘తెలంగాణ భవన్’ మెట్లెక్కిన గిరిజన కుటుంబాలతో ‘నమస్తే తెలంగాణ’ మాట్లాడింది. బాధిత రైతుల కన్నీటి గాథ వారి మాటల్లోనే.. సోమవారం అర్ధరాత్రి పోలీసులు కరెంటు తీశారు.
మా ఇండ్లల్లోకి చొచ్చుకొచ్చారు. అందినవారిని అందినట్టు వ్యాన్లలో బలవంతంగా ఎక్కించారు. 55 మందిని స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ నేతల సూచనతో పార్టీల వారీగా విడదీశారు. ఆందోళనల్లో పాల్గొన్న బీజేపీ, కాంగ్రెస్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, వారి పేర్లను తొలగించారు. బీఆర్ఎస్ వాళ్లమంటూ తమపై చిత్రహింసలకు పాల్పడ్డారు. నలుగురైదుగురిని వేర్వేరు సెల్‌లలో వేసి, బీఆర్ఎస్ ముఖ్యనేతల పేర్లు చె ప్పాలంటూ ఒళ్లంతా దద్దులు వచ్చేలా లాఠీలతో చితకబాదారు. అరికాళ్లు, పిరుదులు, వీపు, చేతులపై కొట్టారు. ఆ దెబ్బలతో నడవలేని స్థితికి చేరుకున్నాం. మొత్తం వ్యవహారం కాంగ్రెస్ పార్టీ పెద్దల డైరెక్షన్లోనే జరిగింది. అంటూ ఒంటిపై దెబ్బలు చూపిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు.