పెద్దేముల్, నవంబర్ 17 : ఓ కేసులో అదుపులోకి తీసుకున్న అనుమానితుడిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించగా అతడు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ పీఎస్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. రెండు నెలల క్రితం మంబాపూర్కు చెందిన గౌస్ కౌలు పొలంలో అనుమానాస్పదంగా మృతిచెందగా పోలీసులు కేసు నమోదుచేసి ఫిరోజ్‌ను అనుమానితుడిగా భావించి అరెస్ట్ చేశారు.
విచారణ సందర్భంగా కానిస్టేబుళ్లు రఫీక్, మురళితోపాటు ఎస్ఐ వేణుకుమార్ తనను 40 నిమిషాలపాటు చితకబాదారని, తీవ్రంగా గాయపడటంతో కుటుంబీకులు తాం డూరు దవాఖానకు తీసుకొచ్చినట్టు బాధితుడు తెలిపాడు. గౌస్‌ను చంపినట్టు ఒప్పుకోవాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చారని.. కొట్టిన విషయాన్ని బయట చెప్పవద్దని ఎస్సై బెదిరించినట్టు పేర్కొన్నాడు.
విచారణ పేరుతో పెద్దేముల్ పోలీసు లు ఫిరోజ్‌ను చితకబాదినట్టు అతడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.