హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Assembly session) కొనసాగుతున్నాయి. మూడో రోజైన నేడు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో హరితవనాల పెంపు, రాష్ట్రంలో పామాయిల్ తోటల పెంపకం, నూతన వైద్య కళాశాల ఏర్పాటు, సింగరేణి బొగ్గు గనుల వేలం, తలసరి ఆదాయం పెరుగుదల, మిషన్ భగీరథ పథకం కోసం రుణాలు, గ్రామ పంచాయతీలుగా తండాలు, గిరిజన ఆదివాసీ గూడేలు, నూతన వ్యవసాయ కళాశాలల ఏర్పాటు, దెబ్బతిన్న రహదారులు, కల్వర్టులకు మరమ్మతులు, అనంత పద్మనాభ స్వామి దేవాలయ పునర్నిర్మాణం, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ద్వారా వచ్చిన ఫలితాలపై చర్చ జరగనుంది. అదేవిధంగా శుక్రవారం ప్రవేశపెట్టిన మూడు బిల్లులపై చర్చించి సభ ఆమోదించనుంది.
ఇక శాసనసభలో ఉదయం ప్రశ్నోత్తరాలకు సమాయం కేటాయిస్తారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీలో ఫ్లై ఓవర్లు, లింకు రోడ్ల నిర్మాణం, ఎస్సీలకు ప్రీ, పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్లు, జీహెచ్ఎంసీలో ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ, రిజిస్ట్రేషన్లు, చేపల పెంపకం, ఉత్పత్తి, పారిశ్రామిక సముదాయాల ఏర్పాటు, అత్యంత వెనుకబడిన తరగతుల (MBC) వారికి ఆర్థిక సహాయం, హైదరాబాద్ పాతబస్తీలో రోడ్ల నిర్మాణం, బీసీ కుల వృత్తిదారులకు ఆర్థిక సహాయం, దళితబంధు, గొర్ర యూనిట్ల పంపిణీ, ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయడం, అందుకు సంబంధించిన విధి విధానాలు వెంటనే రూపొందించే అంశంపై చర్చించనున్నారు.