Huzurabad | హుజూరాబాద్ రూరల్,మే16 : తన కూతురికి వివాహం చేసి అత్తవారింటికి పంపాలనుకున్న ఆ వధువు కుటుంబసభ్యుల ఆశలు.. వరుడు మరొక అమ్మాయిని వివాహం చేసుకోవడంతో అడియాసలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్‌కు చెందిన కుంట శ్రీనివాస్‌రెడ్డి చిన్న కొడుకు మధుకర్‌రెడ్డికి కాట్రపల్లికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది.
శుక్రవారం హుజురాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో వివాహం జరపడానికి ఏర్పాట్లు చేశారు. బుధవారం రాత్రి వరుడు మధుకర్‌రెడ్డి హైదరాబాద్‌లో మరొక యువతిని వివాహం చేసుకొని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.