హైదరాబాద్ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో(Nallgonda) దొంగలు(Thieves) హల్చల్ చేశారు. పార్క్ చేసిన బైక్‌లే లక్ష్యంగా దోపిడీలకు(Stole bikes) పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ రైల్వే స్టేషన్లో పార్క్ చేసిన 3 బైకులు ఎత్తుకెళ్లారు. అలాగే సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌లో పార్క్ చేసిన బైక్‌ను అపహరించారు. మరో సంఘటనలో యాదాద్రిభువనగిరి జిల్లాలో ఇంటి ముందున్న 2 రెండు ద్విచ క్రవాహనాలను దుండగులు తగులబెట్టారు. ముషంపల్లి రోడ్డులో మహిళ మెడలో గొలుసును ఎత్తుకెళ్లారు. వరుస దొంగతనాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు గస్తీ పెంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.