నిజామాబాద్: జిల్లాలోని ధర్పల్లిలో దుండగులు ఏకంగా ఏటీఎం మెషిన్నే (ATM mission) ఎత్తుకెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ధర్పల్లిలోని ఇండీక్యాష్ ఏటీఎంలోకి చొరబడ్డారు. ఏటీఎం మెషిన్‌ను తీసుకెళ్లి గ్రామ శివారులోని పొలాల వద్ద వదలి వెళ్లిపోయారు. ఏటీఎంను ధ్వసం చేసి అందులో ఉన్న డబ్బును ఎత్తుకెళ్లారు.
సోమవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. దుండగులు ఎంత మొత్తంలో డబ్బు ఎత్తుకెళ్లారనే విషయం తెలియాల్సి ఉన్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.