Bakrid | హైదరాబాద్ : బక్రీద్ పండుగ సందర్భంగా ఈనెల 7వ తేదీన ముస్లిం టీచర్లకు బడిబాట కార్యక్రమం నుంచి మినహాయింపునిస్తూ పాఠశాల విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఉపాధ్యాయ సంఘాల వినతి పత్రం మేరకు ఈనెల ఏడో తారీఖు బడిబాట నుంచి ముస్లిం ఉపాధ్యాయులకు మినహాయింపునిచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.