కోవాగ్జిన్ తయారీపై వత్తిళ్లు లేవు.. భారత్ బయోటెక్ కీలక ప్రకటన
COVAXIN vaccine: భారత్ బయోటెక్ సంస్థ ఇవాళ కీలక ప్రకటన చేసింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఆ సంస్థ తన ట్విట్టర్లో ఓ పోస్టు చేసింది. టీకాలపై అవగాహన లేని వారు కోవాగ్జిన్ గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ పేర్కొన్నది. కోవాగ్జిన్ తయారీ కోసం తమపై ఎటువంటి వత్తిడి లేదని
హైదరాబాద్: భారత్ బయోటెక్ సంస్థ ఇవాళ కీలక ప్రకటన చేసింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ తయారీపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ ఆ సంస్థ తన ట్విట్టర్లో ఓ పోస్టు చేసింది. టీకాలపై అవగాహన లేని వారు కోవాగ్జిన్ గురించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ పేర్కొన్నది. కోవాగ్జిన్ తయారీ కోసం తమపై ఎటువంటి వత్తిడి లేదని ఆ సంస్థ తెలిపింది. సురక్షితమైన, ప్రభావంతమైన వ్యాక్సిన్ను తయారు చేసేందుకు మాత్రమే తాము వత్తిడికి గురైనట్లు ఆ సంస్థ పేర్కొన్నది. ఎంతో అధ్యయనం తర్వాత కోవిడ్19 వ్యాధికి కోవాగ్జిన్ టీకాను తయారు చేసినట్లు భారత్ బయోటెక్ తెలిపింది.
#Bharatbiotech #announcement #Vaccine #Covaxin #covid19 #vaccinesafety #healthcare #immunisation #vaccineforall pic.twitter.com/nNwmOuSldw
— Bharat Biotech (@BharatBiotech) November 17, 2022
కోవాగ్జిన్ టీకాపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఇవాళ ప్రకటన చేసింది. రాజకీయ వత్తిళ్ల వల్లే కోవాగ్జిన్ టీకాను వేగంగా అభివృద్ధి చేసినట్లు వస్తున్న వార్తలను కేంద్ర ఆరోగ్య శాఖ ఖండించింది. మీడియాలో వస్తున్న వార్తలు తప్పుగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొన్నది. శాస్త్రీయ పద్ధతిలో, నిర్దేశిత నియమావళి ప్రకారమే కోవాగ్జిన్ కోవిడ్ టీకాను అభివృద్ధి చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

