డ్రైవింగ్ సీట్లో ఎస్సై మనుమరాలు!
అది రంగారెడ్డి జిల్లా గంధంగూడ నుంచి బైరాగిగూడ వెళ్లే మెయిన్‌రోడ్. ఉదయం ఆ దా రిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొందరు వెళ్లి చూడగా ఐదేండ్ల ఓ పాప కారు(టీఎస్07 జీపీ 7450) డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉండటంతో కారును పక్కకు ఆపించారు.
- కారు నెమ్మదిగా వెళ్తుండడంతో ట్రాఫిక్‌జామ్
బండ్లగూడ, జూలై 12: అది రంగారెడ్డి జిల్లా గంధంగూడ నుంచి బైరాగిగూడ వెళ్లే మెయిన్‌రోడ్. ఉదయం ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొందరు వెళ్లి చూడగా ఐదేండ్ల ఓ పాప కారు(టీఎస్07 జీపీ 7450) డ్రైవింగ్ సీట్లో కూర్చొని ఉండటంతో కారును పక్కకు ఆపించారు. వెంటనే ఆ పాప “అంకుల్.. మా తాత ఎస్సై” అంటూ చెప్పింది. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పక్క సీట్లో కూర్చు న్న గంధంగూడకు చెందిన తాత తిరుపతిని ప్రశ్నించగా ఆటోమెటిక్ కారు అని, కంట్రోల్ తన చేతిలోనే ఉందంటూ సమర్థించుకున్నాడు.
దీంతో ప్రజలు అతనిపై మండిపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిన్నారికి కారు ఇచ్చిన వ్యక్తిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎస్సై అని సమాచారం. ఈ కారుపై ఇప్పటికే ఆరు చలానాలు ఉండగా మూడు ఓవర్‌స్పీడ్ చలానాలు. మొత్తంగా రూ.4,010 జరిమా నా చెల్లించాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

