Assembly Speaker | హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంపై ప్రస్తుతం న్యాయ సమీక్షకు ఆస్కారం లేదని, ఈ అంశం పై అసెంబ్లీ స్పీకర్ తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే న్యాయ సమీక్షకు వీలుంటుందని ఫిరాయింపుదారుల తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదించా రు. ఫిరాయింపుదారులపై అనర్హత వే టు వేయాలన్న పిటిషన్లపై ఫలానా తేదీలోగా విచారణ పూర్తి చేయాలంటూ స్పీకర్ను ఆదేశించే అధికారం కోర్టులకు లేదని చెప్పారు. ఇప్పుడు సింగిల్ జడ్జి ఉత్తర్వులను ఆమోదిస్తే రేపు చట్టసభలో స్పీకర్ ఏవిధంగా నిర్ణయాలు తీసుకోవాలో కోర్టులే ఆదేశించొచ్చని పేర్కొన్నారు. గురువారం కూడా ఈ వాదనలు కొనసాగనున్నాయి.
ఇవి కూడా చదవండి
మెడికల్ పీజీ ‘స్థానికత’పై వివరణ ఇవ్వండి: హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయే ట్ సీట్ల భర్తీలో ‘స్థానికత’ వివాదంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్ర భుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 12న తదుపరి విచారణ చేపడతామని హైకో ర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలో క్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధ ర్మాసనం స్పష్టంచేసింది. ఆలోగా కౌం టర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ బుధవారం నోటీసులు జారీ చేసింది.
దివ్యాంగుల సమస్యలపై రాష్ట్రవ్యాప్త పోరు: కొల్లి
హైదరాబాద్, నవంబర్6 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తం గా ఉద్యమిస్తామని అఖిల భారత దివ్యాంగు ల హకుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లో బు ధవారం నిర్వహించిన వేదిక ముఖ్య నాయకు ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల హామీ మేరకు దివ్యాంగుల ఆసరా పింఛ న్ సొమ్మును పెంచాలని, బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.
ఈనెల 30లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి
హైదరాబాద్, నవంబర్ 6(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు ఏటా సమర్పించే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల దాఖలుకు ఈ నెల 30వ వరకు గడువు విధించారు. దేశవ్యాప్తంగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఎస్సీఆర్ ఆధ్వర్యంలో పెన్షనర్ల సంక్షేమ శాఖ సహకారంతో ఈ నెల 30 వరకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల దాఖలుపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.