హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : ‘రాష్ట్రంలో బడిలేని ఊరు ఉండొద్దు. ప్రతి ఊరిలో బడి ఉండేలా చూస్తాం. కొత్త బడులు తెరుస్తం’ ఇది విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి మాటలు. విద్యాశాఖకు సీఎమ్మే మంత్రి కూడా. కానీ 15 నెలల కాంగ్రెస్ పాలనలో రేవంత్రెడ్డి మాటలు ఉత్తవే అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికీ సర్కారు బడులు లేని హ్యాబిటేషన్స్ ఉన్నాయి. విద్యాశాఖ ప్రకటించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోని 3,179 హ్యాబిటేషన్స్కు సర్కారు బడులు అందుబాటులో లేవు. ఇవేవే ఉత్తుత్తి లెక్కలు కాదు.
సాక్షాత్తు పాఠశాల విద్యాశాఖ ప్రకటించిన అధికారిక లెక్కలు. ఈ 3,179 హ్యాబిటేషన్స్లోని 21,806 మంది విద్యార్థులు బడి సౌకర్యంలేక ఆపసోపాలు పడుతూ పక్క గ్రామాల్లోని బడుల్లో చేరుతున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఒక కిలోమీటర్ లోపు ప్రాథమిక బడి, ఐదు కిలోమీటర్ల లోపు ఉన్నత పాఠశాలలు ఉండాలి. ఈ పాఠశాల వసతిలేని పిల్లలకు విద్యాశాఖ రవాణాభత్యం విడుదల చేయాలి. రాష్ట్రంలోని 3,179 హ్యాబిటేషన్స్లో పాఠశాల లేకపోవడంతో 21వేల చిన్నారులకు పాఠశాల విద్యాశాఖ రవాణాభత్యం విడుదల చేసింది. ఒక్కో విద్యార్థికి నెలకు రూ. 600 చొప్పున 10 నెలలకు రూ. 6వేలు ఇస్తారు. ఇలా 21వేల మందికి రూ. 13.08 కోట్లు మంజూరుచేసింది.
వాస్తవాలిలా..