హైదరాబాద్, జూలై 4, (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయనడానికి ఆధారాలు లేవని అర్హత సాధించిన అభ్యర్థుల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. అందువల్ల గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ దా ఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. గ్రూప్-1 పరీక్షలపై దాఖలైన వేర్వేరు వ్యా జ్యాలపై వరుసగా ఐదో రోజు శుక్రవారం జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు విచారణ జరిపారు. ఈ సందర్భంగా గ్రూప్-1 పరీక్షల్లో అర్హత సాధించిన 263మంది అభ్యర్థుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. సీనియర్ న్యాయవాది కిళాంబి లక్ష్మీనర్సింహ, ఇతరులు వాదిస్తూ, గత 14 ఏండ్ల్లుగా నియామకాలు లేవని చెప్పారు. పిటిషనర్లు చేస్తున్న అభియోగాలకు ఆధారాలు చూపలేదని, ఏవిధంగా తమకు అన్యాయం జరిగిందో కూడా ఆధారాలు పేరొనలేదని అన్నారు. గ్రూప్-1 పోస్టులకు అర్హత సాధించిన 263 మందిలో 70 శాతానికిపైగా పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులే ఉన్నారని చెప్పారు. పరీక్షలు పారదర్శకంగా జరిగాయని, పిటిషన్లను కొట్టేయాలని కోరారు. తదుపరి విచారణ సోమవారం జరుపుతామని న్యాయమూర్తి ప్రకటించారు.
జేఎన్టీయూలో కొత్తగా నెస్ట్ జనరేషన్ కోర్సు ; అందుబాటులోకి ‘క్వాంటమ్ కంప్యూటింగ్’ కోర్సు
హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : జేఎన్టీయూలో నెస్ట్ జనరేషన్ కోర్సు.. ‘క్వాంటమ్ కంప్యూటింగ్’ ప్రవేశ పెట్టాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. ఈ కోర్సును 2025-26 విద్యాసంవత్సరం నుంచే అమలు చేయనున్నారు. మైనర్ కోర్సుగా దీనిని ప్రవేశ పెడుతున్నారు. సంబంధించిన సిలబస్‌ను కూడా రూపొందిస్తున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు తెలిపారు. సిలబస్ రూపకల్పనలో భాగంగా ఎన్ఐటీ, ఐఐటీ ప్రొఫెసర్లతో వర్సిటీ అధికారులు, ప్రొఫెసర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్(సీఎస్ఈ)తోపాటు ఇతర ఇంజినీరింగ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు మైనర్ కోర్సుగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సును ప్రవేశపెట్టనున్నారు. భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటర్లను అభివృద్ధి చేసే అంశంపైనా కేంద్రం దృష్టి సారించింది. ఈ అంశంపై డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) ఆధ్వర్యంలో ఇప్పటికే పనులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే జేఎన్టీయూలో కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సును అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు రిజిస్ట్రార్ స్పష్టంచేశారు.