KTR | హైదరాబాద్, జనవరి 7(నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ ఇచ్చిన నోటీసుల్లో ఎలాంటి స్పష్టత లేదని, అవి నోటీసులా కాకుండా లేఖలా ఉన్నాయని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. కేటీఆర్‌కు వచ్చిన నోటీసులకు సంబంధించి మంగళవారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడిన ఆయన మూడు అభ్యంతరాలను వ్యక్తం చేశారు.