హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): తిరుమలలో ఉగ్రవాదులు సం చరిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని తిరుమల ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి స్పష్టంచేశారు. సోమవారం సాయం త్రం ఉగ్రవాదులు ఉన్నట్టు పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ రావడంతో ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. భారీ బందోబస్తు పెంచి, తనిఖీలు ముమ్మరం చేశారు. చివరికి ఫేక్ మెయిల్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకొన్నారు. ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తిరుమలలో ఎలాంటి ఉగ్రవాద కదలికలు లేవని స్పష్టం చేశారు. అసత్య ప్రచారాలను భక్తులు నమ్మొద్దని సూచించారు. తిరుమలలో 24/7 భద్రత పటిష్టంగా ఉంటున్నదని, అనుమానాలు వద్దని తెలిపారు.