AICC Meet | రేపు కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం.. దేశ రాజకీయ పరిణామాలపై చర్చ..!
AICC Meet | దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పశ్చిమబెంగాల్ (West Bengal) ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలు, తృణమూల్ కాంగ్రెస్ (TMC) లో చెలరేగిన అంతర్గత తిరుగుబాటు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. మరోవైపు ఆపరేషన్ లోటస్ (Operation Lotus) భయాలు విపక్ష పార్టీలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది.
AICC Meet : దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పశ్చిమబెంగాల్ (West Bengal) ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బలు, తృణమూల్ కాంగ్రెస్ (TMC) లో చెలరేగిన అంతర్గత తిరుగుబాటు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. మరోవైపు ఆపరేషన్ లోటస్ (Operation Lotus) భయాలు విపక్ష పార్టీలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ (Congress Party) అప్రమత్తమైంది. దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ఆ పార్టీ హైకమాండ్ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జ్లు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులందరూ గురువారం ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. వారందరినీ ఆహ్వానిస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లేఖలు రాశారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగనుంది. జూన్ 8న జరిగిన ఇండియా కూటమి సమావేశంలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పరిణామాలు జరిగిన కొన్నిరోజులకే కాంగ్రెస్ ఈ అంతర్గత భేటీని నిర్వహంచనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రతిపక్షాలు ఐక్యంగా ఎదుర్కొని వీగిపోయేలా చేశాయి. ఆ విజయాన్ని గత సమావేశంలో ఖర్గే అభినందించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి ఎదురుదెబ్బలు తగిలాయి. వాటి నుంచి కోలుకుని, మోదీ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొనేందుకు సరికొత్త ప్రణాళికను ఖర్గే రేపటి సమావేశంలో రాష్ట్రాల నేతలకు వివరించనున్నట్లు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

