హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): ప్రముఖ ఆయుర్వేద ఔషధం ‘గుడుచి/గిలాయ్’తో (తిప్పతీగ) శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, తాజాగా అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సైతం ఒప్పుకున్నారని పతంజలి రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక ప్రకటనలో తెలిపింది. యూరప్‌కు చెందిన ప్రముఖ పరిశోధన జర్నల్ ‘ప్రాంటియర్స్’లో ఇటీవల ప్రచురితమైన పరిశోధన వ్యాసంలో ‘గిలాయ్ తో శరీరంలోని ఏ అవయవంపైనా దుష్ప్రభావం ఉండదు’ అని స్పష్టం చేశారని పేర్కొన్నది. ప్రపంచంలోనే మొదటిసారిగా పతంజలి రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ 70 మందిపై పరిశోధనలు చేసిందని వివరించింది. 28 రోజులపాటు రోజువారీ సగటు డోసుకన్నా ఐదు రెట్లు ఎక్కువగా ఔషధాన్ని ఇచ్చి పరీక్షించినట్టు తెలిపింది. శరీరంలోని 40 అవయవాల పని తీరుపై ఈ ఔషధం ప్రభావాన్ని విశ్లేషించగా, ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని స్పష్టం చేసింది. హెమటోలాజికల్, క్లినికల్ బయో కెమిస్ట్రీ ప్రొఫైల్లోనూ అవయవాలపై ఎలాంటి ప్రభా వం పడలేదని తేలిందన్నారు. ఈ ఫలితాలపై ఆయుర్వేద సమాజం మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నదని చెప్పింది.పొందిన వారి పట్ల కఠినంగానే ఉండాలని, అలాంటి వారు ఉద్యోగానికి అనర్హులని స్పష్టం చేశారు.