హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): సమాచార, పౌర సంబంధాల శాఖ(ఐఅండ్పీఆర్)లో అక్రమ పదోన్నతులు లేవని ఐఅండ్పీఆర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ శనివారం ఖండించింది. ఈ నెల 14న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘ఐఅండ్పీఆర్ డైరెక్టర్ నియామకంపై వివాదం’ వార్తపై సంస్థ ఉద్యోగుల సంఘం స్పందించింది. ప్రభుత్వం పకడ్బందీగా ప్రమోషన్ల ప్రక్రియ చేపడుతున్నదని పేర్కొంది. సమాచార శాఖలో పదవీ విరమణ పొందిన ఓ అధికారి కావాలనే ఉన్నతాధికారుల మనోైస్థెర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని స్పష్టం చేసింది.