హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఉన్న జలవనరుల సంఖ్య ఎంతో తెలుసా? ఏకంగా 63,063. కుంటలు, చెరువులు, రిజర్వాయర్లు, చెక్‌డ్యామ్‌లు లాంటి వాటన్నింటినీ కలిపితే వచ్చిన సంఖ్య ఇది. దీంతో దేశంలో ఎక్కువగా చెక్‌డ్యాములు ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటిగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఉన్న జలవనరులను లెక్కించి కేంద్ర జల్‌శక్తి శాఖ తాజాగా ఈ నివేదికను విడుదల చేసింది. ఈ గణనలో భాగంగా రాష్ర్టాల్లోని చెరువులు, సరస్సులు, రిజర్వాయర్లు, చెక్‌డ్యామ్‌ల వివరాలను సేకరించింది.
ప్రభుత్వ, ప్రైవేట్ జలవనరులు ఎన్ని ఉన్నాయి? వాటిలో ఎన్ని పనిచేస్తున్నాయి? ఎన్ని మరమ్మతులకు గురయ్యాయి? వాటి సామర్థ్యం ఎంత? ఏయే అవసరాలకు వాడుతున్నారు? తదితర అన్ని రకాల వివరాలను సమగ్రంగా సేకరించి నివేదిక రూపొందించింది. అత్యధిక చెక్‌డ్యామ్‌లతో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో నిలిచినట్టు వెల్లడించింది. ఈ జాబితాలో మహారాష్ట్ర, ఏపీ, గుజరాత్ తొలి మూడు స్థానాల్లో నిలిచినట్టు పేర్కొన్నది. తెలంగాణలో 19,153 చెక్‌డ్యామ్‌లు సహా మొత్తం 63 వేలకుపైగా జలవనరులు ఉన్నట్టు తేల్చింది. ఆ వివరాలు ఇవీ..
P2