హైదరాబాద్ : ప్రేమించాలంటూ కొన్నాళ్లుగా పదో తరగితి బాలిక వెంటపడిన నిందితుడు అందుకు ఒప్పు కోకపోవడంతో కత్తితో దాడి (Attacked girl )చేశాడు. ఆపై తాను రైలు(Train) కిందపడి ఆత్మహత్య(Committed suicide)కు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. రమణ అనే నిందితుడు ఓ బాలికను ప్రేమించాలని వెంటపడి వేధించాడు. అందుకు బాలిక ఒప్పుకోలేదు.
దీంతో ప్రేమను నిరాకరిస్తుందనే కోపంతో గురువారం ట్యూషన్లో ఉన్న బాలికపై కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన ట్యూషన్ టీచర్పైనా దాడి చేసి రమణ పరారయ్యాడు. దాడిలో గాయపడిన బాలిక, ట్యూషన్ టీచర్ను దవాఖానకు తరలించారు. కాగా, రమణ రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం విద్యానగర్ (Vidhyanagar) సమీపంలో రైలుపట్టాలపై రమణ మృతదేహం లభ్యమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.