విద్యుత్తు అవసరాల్లో 25% వైటీపీఎస్ నుంచే
రాష్ట్ర విద్యుత్తు అవసరాలను తీర్చడంలో ప్రతిష్ఠాత్మక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) కీలకపాత్ర పోషించనున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విద్యుత్తు అవసరాలను తీర్చడంలో ప్రతిష్ఠాత్మక యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) కీలకపాత్ర పోషించనున్నది. తాజా అంచనాల ప్ర కారం రాష్ర్టానికి అవసరమయ్యే మొత్తం విద్యుత్తులో 25% ఈ ఒక్క పవర్ ప్లాంటే అందించనున్నది. తెలంగాణకు అవసరమైన మొత్తం విద్యుత్తులో టీజీ జెన్కో ప్లాంట్ల ద్వారా 37% సమకూరనుండగా.. అందులో 25% వైటీపీఎస్ నుంచే అందనున్నది. మిగిలిన 63% విద్యుత్తులో సెంట్రల్ సెక్టార్ పవర్ ప్లాంట్ల నుంచి కొంత, బహిరంగ మార్కెట్ నుంచి మరికొంత కొనుగోలు చేస్తున్నారు.
వైటీపీఎస్‌లో 800 మోగావాట్ల సామర్థ్యం కలిగిన 5 యూనిట్లు ఉన్నాయి. ప్రస్తుతం యూనిట్-1, యూనిట్-2లో విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. ఇటీవల మరో యూనిట్ సీవోడీ కూడా పూర్తయ్యింది. వైటీపీఎస్ నిర్మాణం కోసం ఒక్కో మెగావాట్‌కు రూ.9.07 కోట్ల చొప్పున ఖర్చయినట్టు అధికారులు చెప్తున్నారు. ఆ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు చార్జీని యూనిట్‌కు రూ.6గా ప్రతిపాదించినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

