TGSRTC | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నల్లకుంటలో ఆర్టీసీ కండక్టర్పై గురువారం ఓ మహిళ(పాములు ఆడించే వృత్తి)పామును విసిరింది. దిల్సుక్నగర్ డిపోకు చెందిన బస్సును నల్లకుంటలో ఆమె ఆపేందుకు ప్రయత నించగా డ్రైవర్ ఆపలేదు. దీంతో ఆ మహిళ తన చేతిలో ఉన్న ఓ సీసాను బస్సు వెనకభాగం అద్దంపై విసిరింది. ఒక్కసారిగా డ్రైవర్ బస్సును ఆపి ఆమె చేతులు కట్టేసి బస్సులో ఎక్కించారు.
ఎందుకిలా చేశావంటూ డ్రైవర్, కండక్టర్లు నిలదీయగా, వారి నుంచి విడిపించుకున్న ఆ మహిళా తన బ్యాగులో ఉన్న పామును బయటకు తీసి ఒక్కసారిగా కండక్టర్పై విసిరింది. దీంతో కంగుతిన్న కండక్టర్ షాక్కు గురైంది. ఈ లోపుగా ప్రయాణికులంతా కిందికి పరుగులు తీశారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు.