సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 20: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్‌లో నీటి సమస్య తీరింది. మూడు నెలలుగా నీటి సమస్య ఉన్నా.. పంచాయతీ కార్యదర్శి, అధికారులు పట్టించుకోవడం లేదని గురువారం మహిళలు ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు.
ఈ క్రమంలో ‘మంచీనీళ్లు మహో ప్రభో’ శీర్షికన శుక్రవారం నమస్తే తెలంగాణ లో ప్రచురితమైన కథనానికి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా స్పందించారు. గ్రామంలోని బోర్లు మరమ్మతు చేసి, నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. మాజీ ఎంపీటీసీ బైరినేని రాము చొరవతో జీపీ కార్యదర్శి నీరజ, సిబ్బంది బోర్లను మరమ్మతు చేయించి కొత్త బోరు మోటర్ బిగించి శుక్రవారం నీటిని సరఫరా చేశారు. దీంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.