సుల్తాన్‌బజార్, నవంబర్ 6: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్, ఎగ్జిబిషన్ సొసైటీ, ఎకనామిక్ కమిటీల ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉప కులపతులను ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వీ వెంకటరమణ, ఓయూ వీసీ ప్రొఫెసర్ డీ రవీందర్, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి, శాతవాహన వర్సిటీ వీసీ ప్రొఫెసర్ శంకసాల మల్లేశ్, తెలంగాణ వర్సిటీ వీసీ డీ రవీందర్, కేయూ వీసీ టీ రమేశ్, పాలమూరు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎల్బీ లక్ష్మీకాంత్ రాథోడ్, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ సీహెచ్ గోపాల్‌రెడ్డి, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ కే సీతారామారావు, కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ నీరజప్రభాకర్, జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ వీ ప్రవీణ్రావులకు శాలువాలు కప్పి జ్ఞాపికలు అందించి సత్కరించారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ప్రభాశంకర్, ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ కార్యదర్శి జీబీ అశోక్, ఎకనామిక్ కమిటీ కార్యదర్శి ఎన్ సురేందర్, ఓయూ సైన్స్ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ ఏ బాలకిషన్ పాల్గొన్నారు.