దేశంలో విదేశీ వర్సిటీలు
దేశాన్ని గ్లోబల్ స్టడీ డెస్టినేషన్‌గా మార్చేందుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ సన్నాహాలు చేస్తున్నది. భారత్‌లో ఉన్నత విద్యావకాశాల కోసం విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటును స్వాగతిస్తున్నది. గురువారం దీనికి సంబంధించిన ముసాయిదాను యూజీసీ చైర్మన్ ఎం జగదీశ్ కుమార్ విడుదల చేశారు.
- క్యాంపస్‌ల ఏర్పాటుకు యూజీసీ అనుమతి
- అడ్మిషన్లు, ఫీజులు వారిష్టం
- స్థానిక వర్సిటీలతో సమన్వయం
- ముసాయిదా విడుదల
న్యూఢిల్లీ/ హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): దేశాన్ని గ్లోబల్ స్టడీ డెస్టినేషన్‌గా మార్చేందుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ సన్నాహాలు చేస్తున్నది. భారత్‌లో ఉన్నత విద్యావకాశాల కోసం విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటును స్వాగతిస్తున్నది. గురువారం దీనికి సంబంధించిన ముసాయిదాను యూజీసీ చైర్మన్ ఎం జగదీశ్ కుమార్ విడుదల చేశారు. ముసాయిదాపై ఈ నెల 18లోగా ugcforeigncollaboration@ gmail. com మెయిల్లో సలహాలు, సూచనలు పం పాలని సూచించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 సిఫార్సుల మేరకు విదేశీ యూ నివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. దీనిద్వారా విదేశీ యూనివర్సిటీలు దేశంలో క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు.
విదేశీ విద్యను భారతదేశంలోని విద్యార్థులకు చేరువ చేయడమే యూజీసీ ఉద్దేశమని తెలిపారు. దేశంలో న్యాక్ గ్రేడ్ పొందిన భారత వర్సిటీల సమన్వయంతో వీటిని నిర్వహించనున్నట్టు తెలిపారు. వీటికి యూజీసీ గుర్తింపు ఇస్తుందని చెప్పారు. వీటి ఏర్పాటు కోసం సంస్థలు ముందుగా యూజీసీ అనుమతికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసిన 45 రోజుల్లో అనుమతులు లభిస్తాయని చెప్పారు. ప్రవేశాలకు సంబంధించిన వివరాలు, కోర్సులు, ఫీజులకు సంబంధించి వివరాలను ప్రవేశాలకు 60 రోజుల ముందే విదేశీ యూనివర్శిటీ స్థాపించే సంస్థలు వెల్లడించాలని పేర్కొన్నారు. డిగ్రీ, డ్యూయల్ డిగ్రీలను నిర్వహించేందుకు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ముసాయిదాకు సంబంధించిన సూచనలు, సలహాలను బట్టి తుది మార్గదర్శకాలు వెల్లడిస్తామని జగదీశ్ కుమార్ పేర్కొన్నారు.
ముసాయిదాలోని ముఖ్యాంశాలు
- విదేశీ వర్సిటీలు కచ్చితంగా యూజీసీ అనుమతితోనే తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకోవాలి.
- ఆన్లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానాల్లో తరగతుల నిర్వహణకు అనుమతి లేదు.
- కచ్చితంగా ఆఫ్‌లైన్ విధానంలోనే ఫుల్‌టైమ్ కోర్సులను నిర్వహించాలి.
- నచ్చిన రీతిలో అడ్మిషన్లు, ఫీజుల విధానాన్ని రూపొందించుకోవచ్చు.
- ప్రాథమికంగా విదేశీ వర్సిటీలకు పదేండ్ల పాటు అనుమతి ఇస్తారు.
- అనుమతి పునరుద్ధరణకు 9వ సంవత్సరంలో నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకోవాలి.
- దేశ సమగ్రత, జాతి ఆసక్తిని ప్రమాదంలో పడేసేలా విద్యాబోధన ఉండకూడదు.
- ఫెమా-1999 చట్టానికి లోబడి ఈ వర్సిటీలకు నిధుల మళ్లింపు ఉండాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

