హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): 2025-26 విద్యాసంవత్సరానికి ఆర్థిక సహాయం అందించడానికి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ దరఖాస్తులు కోరుతున్నది. బీడీ, గనుల, సినీ కార్మికుల పిల్లలు ఈ ఆర్థిక సహాయానికి అర్హులు అని కేంద్ర కార్మిక శాఖ కమిషనర్ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నెల 15వరకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లకు, అక్టోబర్ 31 వరకు పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్లకు గడువు పొడిగించినట్టు తెలిపారు.