హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): సీఎస్ఐఆర్ – యూజీసీ నెట్ పరీక్ష ఈ నెల 18న జరుగనున్నది. లైఫ్ సైన్సెస్, ఎర్త్ అట్మాస్పియర్ ఓషియన్ అండ్ ప్లానెటరీ సైన్స్, కెమికల్, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటికల్ సైన్స్ పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)వెబ్సైట్లో విడుదల చేసింది.