రంగారెడ్డి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మైలార్దేవుపల్లిలో 17 ఏండ్ల బాలుడిని దుండగులు గొంతుకోసి కిరాతకంగా హతమార్చారు. ఈ అమానుష సంఘటన మైలార్‌దేవుపల్లిలోని లక్ష్మీగూడ హౌసింగ్‌బోర్డ్ కాలనీలోని నిర్మానుష్య ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. మృతుడు బీహార్‌కు చెందిన రాజా పాశ్వాన్‌గా గుర్తించారు. కాగా, రెండు రోజుల క్రితం బిహార్‌కు చెందిన వారితో పాశ్వాన్‌కు గొడవ జరిగినట్లు తెలిసింది. అయితే గొడవపడిన వారే చంపి ఉంటారని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.