స్టాఫ్ ఫొటోగ్రాఫర్, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలోని తంగళ్లపల్లి మానేరు బ్రిడ్జి వెలవెలబోతున్నది. ఒకప్పుడు కాళేశ్వరం జలాలతో శ్రీ రాజరాజేశ్వర జలాశయం జలకళను సంతరించుకొని బ్యాక్‌వాటర్‌తో ఎండాకాలంలోనూ సముద్రాన్ని తలపించిన బ్రిడ్జి ప్రాంతం, ఇప్పుడు వానకాలంలో నిర్జీవంగా కనిపిస్తున్నది.
ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు పడకపోవడం, మరోవైపు గోదావరి ఎత్తిపోతలు లేకపోవడంతో రిజర్వాయర్‌లో నీటి మట్టం తగ్గిపోతుండగా, బ్రిడ్జి కళావిహీనంగా మారింది.