హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) కోరింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రత్యేక ఆర్డినెన్స్ తేవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వోడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య కోరారు.
సమస్య పరిష్కారం కాకపోతే, ఢిల్లీ వేదికగా భారీ ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.