హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): టీశాట్ సంస్థను ప్రభుత్వం విద్యాశాఖలో విలీనం చేసింది. ఈ మేరకు మంగళవారం జీవో -79ని జారీ చేసింది. టీశాట్ ప్రస్తుతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నది.
ఈ సంస్థను విద్యాశాఖలో విలీనం చేసేందుకు ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.