Home
Telangana
The Telangana Cyber Security Bureau Has Warned That Boss Scams Are Causing Alarm Across The Country And Advised Employees To Remain Vigilant
బెంబేలెత్తిస్తున్న బాస్ స్కామ్.. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి : సీఎస్బీ
దేశవ్యాప్తంగా ‘బాస్ స్కామ్'లు దడ పుట్టిస్తున్నాయని, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది.
హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా ‘బాస్ స్కామ్’లు దడ పుట్టిస్తున్నాయని, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. ఈ మేరకు బుధవారం డీజీ శిఖాగోయెల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఐ4సీ నివేదికల ప్రకారం 20 రోజుల్లోనే దేశవ్యాప్తంగా ఈ తరహా మోసాలపై 300కుపైగా ఫిర్యాదులు నమోదైనట్టు పేర్కొన్నారు.
సైబర్ నేరగాళ్లు సీనియర్ అధికారుల డీపీలు పెట్టి, కంపెనీల అధిపతుల పేర్లను వాడుకుంటూ ఉద్యోగులకు ఈ మెయిల్స్ లేదా వాట్సాప్ ద్వారా సందేశాలు పంపుతారని తెలిపారు. ZIP లేదా RAR ఫైళ్లను ఓపెన్ చేయొద్దని, ‘Urgent Compliance’ లేదా ‘Immediate Action Required’ అనే మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించారు. అనుమానాస్పద సందేశాలు వస్తే.. వెంటనే సంస్థలోని ఐటీ, భద్రతా విభాగానికి సమాచారం అందించాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

