ZP High School | పెనుబల్లి: జుట్టు పెంచుకొని పాఠశాలకు వస్తున్నారంటూ ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలు శిరీష విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఘటన శనివారం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ జడ్పీహెచ్ఎస్లో చోటుచేసుకుంది. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఇలా చేయడం ఏమిటని, అవమానభారంతో పిల్లలు ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యత వహించాలని తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఉపాధ్యాయురాలు చేసిన నిర్వాకానికి తమ పిల్లలకు పూర్తిగా గుండు కొట్టించాల్సి వచ్చిందని తల్లిదండ్రులు చెప్పారు. విషయం తెలుసుకున్న డీఈవో సోమశేఖర శర్మ సదరు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు.
ఖలీల్‌వాడి: ఐదు నెలలైనా కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదని గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకంలో పనిచేసే కార్మికులు 20 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయినా అధికారులు, కాంట్రాక్టర్ స్పందించకపోవడంతో జిల్లా లేబర్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్‌బాబు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలపై ఇరిగేషన్ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి కార్మికులకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.