హైదరాబాద్, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకు ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వే ఈనెల 25తో ముగుస్తుందని అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గతవారం ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేలో ఇప్పటివరకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు మూడు లక్షలకుపైగా పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందించినట్టు వారు పేర్కొన్నారు. www.telangana.gov.in /telanganarising అనే వెబ్సైట్ ద్వారా ప్రజలు తమ సలహాలు, సూచనలు పంపవచ్చని తెలిపారు. 2047నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి తగు సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టిన విషయం విదితమే.