హైదరాబాద్, ఏప్రిల్ 1(నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మంగళవారం నుంచి ప్రారంభమైంది.
పలుచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈనెల నుంచి రేషన్‌షాపులో సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిరోజు 11 లక్షల మందికి సన్నబియ్యం పంపిణీ చేశారు.