హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని వర్సిటీలు, విద్యాసంస్థలకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌పై అవగాహన కల్పిచేందుకు కేంద్రం రూ. 52లక్షల నిధులు మంజూరుచేసింది. వీటిలో తొలివిడతగా రూ. 13లక్షలు విడుదల చేసింది. బుధవారం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌పై నోడల్ ఆఫీసర్లకు ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం, ఎస్కే మహమూద్, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొని పలు అంశాలపై అవగాహన కల్పించారు.
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : మాడల్ స్కూల్ టీచర్లకు డీఏ బకాయిలు, డెత్ గ్రాట్యుటీ మంజూరుచేయాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ కోరింది. సంఘం క్యాలెండర్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 010 పద్దు ద్వారా వేతనాలు వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సంఘం అధ్యక్షుడు భూతం యాకమల్లు, ఉపాధ్యక్షులు శంకర్‌నాయక్, దండెం రవికుమార్, వీరభద్రం పాల్గొన్నారు.