హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : మాజీ సైనికులు, అమరులైన సైనిక కుటుంబాలకు మరింత మద్దతుగా నిలవాలని సాయుధ దళాల రాష్ట్ర మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు వివిధ సందర్భాల్లో అందించే సాయాన్ని పెంచింది. సైనికుల కుటుంబాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది.
కమిటీ చైర్మన్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షతన 4వ సమావేశం జరిగింది. సమావేశంలో ఐఏఎస్లు, సైనిక అధికారులు, సైనిక సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.