‘మూసీ’కి ప్రపంచ బ్యాంకు రుణం!
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం ప్రపంచబ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
- 4,200 కోట్ల రుణ సమీకరణకు ప్రయత్నాలు
- లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడి
హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం ప్రపంచబ్యాంకు నుంచి రుణం తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.4,200 కోట్లు పొందేందుకు ప్రతిపాదనలు పంపింది. రేవంత్‌రెడ్డి సర్కా రు సమర్పించిన ప్రాథమిక ప్రాజెక్టు నివేదికకు కేంద్ర పట్టణ, గృహ నిర్మాణ శాఖకు చెందిన ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టు కమిటీ ఆమోదం తెలిపింది. ప్రతిపాదనలను ఆర్థిక వ్యవహారాలశాఖకు సిఫారసు చేసినట్టు కేంద్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి తోఖన్సాహూ చెప్పారు.
లోక్‌సభలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మూసీలో నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, స్టార్మ్‌వాటర్ మేనేజ్మెంట్కు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్ర ప్రజారోగ్య, పర్యావరణ ఇంజినీరింగ్ సంస్థకు సమర్పించి సాంకేతిక అనుమతి పొందాల్సి ఉంటుందని తెలిపారు. తర్వాతే రుణ ఒప్పందం ఖరారు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

