హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
వీరిలో వెయిటింగ్లో ఉన్న అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. సీఐడీ ఎస్పీగా ఆర్ వెంకటేశ్వర్లు, సైబరాబాద్ పరిపాలన డీసీపీగా యోగేశ్ గౌతమ్, పీసీఎస్ ఎస్పీగా రంగారెడ్డి, జీఆర్పీ అడ్మిన్ ఎస్పీగా రాఘవేందర్‌రెడ్డి, వరంగల్ పోలీస్ శిక్షణా కేంద్రం ఎస్పీగా పూజ, డీజీపీ కార్యాలయం న్యాయవిభాగం ఎస్పీగా సతీశ్, వరంగల్ నేర విభాగం డీసీపీగా మురళీధర్‌ను నియమించింది.