సికింద్రాబాద్, డిసెంబర్ 24: ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీని ఆదివారం హైదరాబాద్‌లోని ఓయూ ఆడిటోరియంలో ప్రకటించారు. అధ్యక్షుడిగా కొప్పుల రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ సాగబోయిన పాపారావు, ప్రధాన కార్యదర్శులుగా ఆరెం అరుణ్‌కుమార్, సున్నం సతీశ్, కుర్నిబెల్లి గణేశ్, వెడమ కిషన్, ఉపాధ్యక్షులుగా గౌరీవేణి ప్రవీణ్, చర్చ రవి, సొడే నవీన్, సిడాం రమేశ్, సహాయ కార్యదర్శిగా కోరం వీరయ్య, ప్రచార కార్యదర్శులు గావిడి నాగబాబు, ఇరు ప్రభాకర్, కోశాధికారి వెంకన్న, సభ్యులుగా వట్టం నవీన్, నవీన్ బచ్చలి, కుంజ రుక్మిణిని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ ఇకపై ఓయూ కేంద్రంగా ఆదివాసీ విద్యార్థి, సామాజిక సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఏఎస్యూ తిరుగు లేని పోరాటాలను చేస్తుందని తెలిపారు.