Parishad Elections | త్వరలోనే పరిషత్ ఎన్నికలు.. ఓటర్ల మ్యాపింగ్‌కు ఎన్నికల సంఘం ఆదేశాలు!
Parishad Elections | రాష్ట్రంలో మం డల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతున్న ది. ఈ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం (టీజీ ఎస్ఈసీ) కీలక నిర్ణయం తీసుకున్నది.
Parishad Elections | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మం డల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతున్న ది. ఈ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం (టీజీ ఎస్ఈసీ) కీలక నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అందిన తాజా ఓటర్ల జాబితా డాటా ఆధారంగా గ్రామ పంచాయ తీ వార్డులవారీగా ఓటర్ల మ్యాపింగ్ చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
జడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఎంపీడీవోలు యుద్ధప్రతిపాదికన ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఎస్ఈసీ కార్యదర్శి లింగ్యానాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. 2026 ఫిబ్రవరి 5 నాటి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా డాటా ఆధారంగా మండలాల వారీగా జాబితాలను రూపొందించాలని ఎస్ఈసీ ఆదేశించింది. ఈ జాబితాలను గ్రామ పంచాయతీ వార్డు రోల్స్‌కు మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది.
ఈ నెల 23లోగా నివేదిక
కొత్త డాటాను పాత జాబితాలతో పోల్చి చూసినప్పుడు ఏవైనా వ్యత్యాసాలు కనిపిస్తే, వాటిని గుర్తించి ఈ నెల 23వ తేదీలోగా నివేదించాలని అధికారులను ఎస్ఈసీ ఆదేశించింది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణలో ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉండేందుకు ఈ ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో, ఓటర్ల విభజనతోపాటు వార్డుల వారీగా స్పష్టమైన ఓటర్ల జాబితా సిద్ధం కావడం అత్యవసరం. పంచాయతీ, మండల, జిల్లా స్థాయిలో ఓటర్ల సంఖ్యను కచ్చితంగా నిర్ధారించడం ద్వారా ఎన్నికల నోటిఫికేషన్‌కు మార్గం సుగమం కానున్నది. ఎస్ఈసీ తాజా ఆదేశాలతో జిల్లాల్లోని ఎన్నికల యంత్రాంగం, పంచాయతీరాజ్ అధికారులు ఓటరు లిస్టు మ్యాపింగ్ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. ఇక జిల్లా, మండల పరిషత్ ఎన్నికలే మిగిలాయి. ఓటర్ల జాబితా అప్డేట్ ప్రక్రియ యుద్ధప్రాతిపదికన చేపడుతుండటంతో త్వరలోనే రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల నగారా మోగుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

