జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి(Jayashankar district) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తల్లిని కొడుకు గొడ్డలితో నరికి చంపాడు(Killed). వివరాల్లోకి వెళ్తే.. రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో మతిస్థిమితం లేని కొడుకు తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. గ్రామానికి చెందిన కంచరకుంట్ల రాజిరెడ్డి మతిస్థిమితం(Paranoia) సరిగా లేక శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు తల్లి కంచరకుంట్ల హైమావతిని గొడ్డలితో నరికి అతికిరాతకంగా హత్య చేశాడు.
గోడవను చూసి ఇంటి పక్కన ఉన్న ఊకంటి లలిత అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమె పై దాడి చేశాడు. లలిత ను ఎంజీఎంకు తరలించగా పరిస్థితి విషమంగా ఉంది. తల్లిని చంపి ఇంటి పక్క వారిపై దాడి చేసి పారిపోతుండగా.. గోరుకొత్తపల్లి మండలం చిన్నకోడపాక గ్రామంలో రాజిరెడ్డి అనుమానాస్పదంగా కనిపించడంతో గ్రామస్తులు అతన్ని దొంగగా భావించి పట్టుకుని తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారమిచ్చారు.