హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ కేసులో హైటెక్ మాస్‌కాపీయింగ్‌కు కావాల్సిన వనరులను సమకూర్చిన మహ్మద్ ఖలీద్‌ను సిట్ శుక్రవారం కస్టడీలోకి తీసుకొన్నది. ఏఈ పూల రమేశ్ నెట్వర్క్ భారీగా ఉన్నట్టు సిట్ గుర్తించింది. ఎలక్ట్రానిక్ డివైస్‌లు అభ్యర్థులకిచ్చి కేంద్రంలోకి పంపిన రమేశ్, వారికి ఒక టెక్నికల్ టీమ్‌తో చాట్ జీపీటీని ఆధారంగా చేసుకొని సమాధానాలు చెప్పించాడు. తన టీమ్‌కు మలక్‌పేట్‌లో ఖలీద్ షెల్టర్‌ను సమకూర్చాడు. రమేశ్ పిల్లలకు ఖలీద్ ట్యూ షన్ చెబుతాడు.ఈ క్రమంలోనే రెండు రోజులకు గది కావాలంటూ కోరాడు.
దీంతో ఖలీ ద్ తాను ట్యూషన్ చెప్పే గదిని ఇచ్చాడు. ఇందుకు రమేశ్ రూ.80 వేలు ఇచ్చాడు. ఈ నెల 9న ఖలీద్‌ను సిట్ అరెస్ట్ చేసింది. మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించడంతో శుక్రవారం నిందితుడు ఖలీద్‌ను సిట్ కస్టడీలోకి తీసుకొని విచారిస్తుంది. ఈ విచారణలో టెక్నికల్ సెంటర్ నుంచి ఎంత మందికి సమాధానాలు చేరవేశారు. ఎన్ని ల్యాప్‌టాప్‌లు వాడారు, ఎంత మంది టెక్నికల్ బృందం సహకరించింది తదితర అంశాలపై సిట్ ప్రశ్నించింది.