Entrance Exams | హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే, తెలంగాణ): ఇంజినీరింగ్, ఎప్సెట్, ఎడ్సెట్, ఐసెట్ సహా పలు ప్రవేశ పరీక్షలకు సంబంధించి సెట్ కమిటీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. ప్రవేశ పరీక్షల్లో నిమిషం ఆలస్యమైనా అనుమతించకూడదని నిబంధన అమలవుతున్నది. ఇకపై పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందు వచ్చిన అభ్యర్థులనే సెంటర్ లోపలకి అనుమతిస్తామని స్పష్టంచేసింది.
15 నిమిషాల ముందే గేట్లను మూసేయనున్నట్టు వెల్లడించింది. టీజీపీఎస్సీ పరీక్షలకు అరగంట ముందుగా గేట్లు మూసేస్తున్నారు. జేఈఈ, నీట్లోనూ ఇదే నిబంధన అమలువుతన్నది.