హైదరాబాద్, నవంబర్5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వర్సిటీల వైస్చాన్స్లర్ల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. తాము అనుకున్న వారికి వీసీ పోస్టును కట్టబెట్టేందుకు ఎంతకైనా తెగిస్తున్నది. ఆఖరుకు అత్యంత కీలకమైన సెర్చ్ కమిటీని పెక్కనపెట్టి కొత్త సెర్చ్ కమిటీవేయబోతున్నది. ఇటీవలే రాష్ట్రంలోని 9 వర్సిటీలకు నూతన వీసీలను నియమించారు. జేఎన్టీయూ, జేఏఎన్ఎఫ్ఏయూ, బీఆర్ అంబేద్కర్ వర్సిటీల వీసీల ఎంపికకు బ్రేక్‌పడింది. దీంట్లో బీఆర్ అంబేద్కర్ మినహా మిగతా రెండింటిపై ప్రభుత్వం పట్టుదలకు పోతున్నట్టుగా వార్తలొస్తున్నాయి.
జే ఎన్టీయూ, జేఏఎన్ఎఫ్ఏయూ జాబి తాలో తమకు నచ్చని వారి పేర్లు ఉం డటంతో గవర్నర్ ఆమోదానికి పంపి ంచలేదని సమాచారం. వీరికి వీసీ పోస్టు ఇవ్వడం ఇష్టంలేకే ప్రభు త్వం సెర్చ్ కమిటీ సమావేశాలను ని ర్వహించడంలేదన్న ప్రచారం జరుగుతున్నది. అవసరమైదే సెర్చ్ కమిటీల ను రద్దు చేసి, మరో కమిటీ వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.