హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : వరద బాధితులను ఆదుకోవడం కోసం సీఎంసహాయ నిధికి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. సచివాయంలో సీఎం రేవంత్‌రెడ్డిని పలు కంపెనీలకు చెందిన ప్రముఖులు శుక్రవారం కలిసి విరాళాలు అందజేశారు. జీఎంఆర్ గ్రూపు రూ.2.50 కోట్ల చెక్కును అందజేశారు.
కెమిలాయిడ్స్ కంపెనీ చైర్మన్ రంగరాజు, శ్రీచైతన్య విద్యాసంస్థలు, విర్కోఫార్మా, అపోలో హాస్పిటల్ జేఎండీ సంగీతారెడ్డి, ఆర్బీఆర్ ప్రాజెక్ట్ ఎండీ రాయల రఘు రూ. కోటి చొప్పున విరాళం అందజేశారు. ప్రొటెం మాజీ చైర్మన్ వెన్నవరం భూపాల్‌రెడ్డి రూ. 2 లక్షల విరాళం అందజేశారు.
శుక్రవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆదర్శ్‌రెడ్డికి ఈ చెక్కులు ఇచ్చారు. రూ.లక్ష తెలంగాణకు, రూ. లక్ష ఆంధ్రప్రదేశ్‌కు అందజేయాలని సూచించారు.