హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : ప్రాథమిక విద్యారంగాన్ని బలోపేతం చేయాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (ఎస్జీటీయూ) ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం ఎస్జీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి అరికెల వెంకటేశం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి, పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు.
ప్రాథమిక పాఠశాలల్లో హెచ్ఎంతో పాటు కనీసం ఇద్దరు టీచర్లుండాలని, సీపీఎస్‌ను రద్దుచేయాలని, గ్రామపంచాయతీకి ఒక మాడల్ ప్రాథమిక పాఠశాలను ఏర్పాటుచేయాలని కోరారు. ఎస్జీటీలకు టీచర్ ఎమ్మెల్సీ ఓటుహక్కు కల్పించాలని, పదోన్నతులు, బదిలీలు పూర్తిచేసి, కొత్త టీచర్లను నియమించాలని విజ్ఞప్తి చేశారు.