హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 6 -9 తరగతుల్లోని విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు అమలుచేస్తున్న ‘లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్’ ప్రోగ్రామ్ మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
ఈ ప్రోగ్రామ్ పర్యవేక్షణకు ఎస్సీఈఆర్టీలో స్టేట్, డీఈవో కార్యాలయాల్లో జిల్లా స్థాయి లిప్ సెల్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. మండల విద్యాధికారులు ప్రతి వారం కనీసం మూడు పాఠశాలలను, వారానికి ఐదారు స్కూళ్లు సందర్శించాలని సూచించింది.