బెల్లంపల్లి, జూన్ 17: ప్రజాదరణ కోల్పోయిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చేందుకు అబద్ధాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకొంటున్నది. కాంగ్రెస్ నాయకులనే తిరిగి అదే పార్టీలో చేర్చుకుంటున్నది. పైగా బీఆర్ఎస్ నాయకులంటూ కలరింగ్ ఇస్తున్నది. శనివారం హైదరాబాద్‌లో గడ్డం వినోద్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్‌లో చేరగా, వారికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్ఎస్యూఐ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు సోడాయ్ వినేష్ అనే వ్యక్తి మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయాడు.
ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నాడు. అలాగే మేకల శ్రీనివాస్ కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. వీరిద్దరూ రేవంత్ సమక్షంలో తిరిగి అదే పార్టీలో చేరారు. పైగా వీరు బీఆర్ఎస్ నాయకులంటూ ప్రచారం చేశారు. సొంత నాయకులకే మళ్లీ కండువాలు కప్పించడం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి గడ్డం వినోద్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజక వర్గంలోని పలు మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులను రేవంత్‌రెడ్డి సమక్షంలో చేర్పించి.. తమ అధినేతనే మోసం చేశారని సొంత పార్టీలోని మరో వర్గం నాయకులు విమర్శిస్తున్నారు.

Revanthreddy