హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : తిరుమలలో మూడురోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతున్నది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి, బయట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారని టీటీడీ తెలిపింది. ఫ్రీ దర్శనానికి దాదాపు 16 గంటలు కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని తెలిపింది. మరోవైపు, టైమ్‌స్లాట్ ఎస్ఎస్డీ దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది.