హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే చేపట్టాలని, జూన్ 2న అపాయింటెడ్ డే ప్రకటించాలని తెలంగాణ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) డిమాండ్చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపో/యూనిట్ల వద్ద బ్యాడ్జీలు ధరించి ‘డిమాండ్ డే’ను విజయవంతం చేశారు. మొదటి డ్యూటీ నుంచే డిపోల ఎదుట తమ నిరసన తెలిపిన కార్మికులకు ఎస్‌డబ్ల్యూఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్ రావులు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి వీఎస్‌రావు, ప్రచార కార్యదర్శి పీ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులను ప్రభు త్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించి, విలీన ప్రక్రియలో రిజిస్టర్డ్ కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత, అలవెన్స్‌ల పెంపుదలపై వెంటనే సర్యులర్‌ను విడుదల చేయాలని కోరారు.
తెలంగాణ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వరర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, వరింగ్ ప్రెసిడెంట్ అజయ్‌బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యల పరిషారం కోసం అన్ని యూనియన్లతో చర్చించి పరిషరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ డిపో వద్ద రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు, ఖమ్మంలో ఉప ప్రధాన కార్యదర్శి జీ లింగమూర్తి, రీజినల్ కార్యదర్శి పిట్టల సుధాకర్, వరంగల్-1లో రీజినల్ కార్యదర్శి ఉపేంద్రాచారి, ఆదిలాబాద్‌లో ఎం భీమ్రావు, సూర్యాపేటలో బత్తుల సుధాకర్, రాజేంద్రనగర్‌లో ఎస్ కృష్ణ, జీడిమెట్ల డిపో వద్ద కే గీత ప్రసంగించారు.